బహుమతిగా అందుకున్న చీరను బడ్జెట్ వేళ ధరించిన నిర్మలా సీతారామన్! ఎవరిచ్చారంటే?

Header Banner

బహుమతిగా అందుకున్న చీరను బడ్జెట్ వేళ ధరించిన నిర్మలా సీతారామన్! ఎవరిచ్చారంటే?

  Sat Feb 01, 2025 12:02        Politics

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టే క్రమంలో కేంద్రమంత్రి ధరించిన చీరలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్మలా సీతారామన్ చేనేత వస్త్రాలకే ప్రాధన్యత ఇస్తున్నారు. ప్రతీ బడ్జెట్ కు ఆమె చేనేత చీరలోనే లోక్ సభకు వస్తున్నారు. ఈ రోజు కూడా చేనేత చీరను ధరించి బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్‌, శాలువాతో కనిపించారు. చీరపై ఉన్న చేపల ఆర్ట్‌ ఆకట్టుకుంది. ఈసారి కేంద్ర మంత్రి ధరించిన చీరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేంద్ర మంత్రి నిర్మల బిహార్ లోని మధుబనికి వెళ్లినపుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి ఆమెను కలుసుకున్నారు. తాను డిజైన్‌ చేసిన చేనేత చీరను కేంద్ర మంత్రికి బహుకరించారు. బడ్జెట్ వేళ ఈ చీరను ధరించాలని కోరారు. పద్మశ్రీ దులారీదేవికి ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ చీరను ధరించారు.
 
ఏ బడ్జెట్ కు ఏ చీర ధరించారంటే..
2019
లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. 
2020
లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు.
2021
లో ఎరుపు-గోధుమరంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరలో కనిపించారు.
2022
లో మెరూన్‌ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీర.
2023
లో బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.
 2024
లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా రామా బ్లూ రంగు చీర ధరించారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!

 

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

 

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Budget2025 #NirmalaSitharaman #Nirmalasaree #Budgetsaree #BudgetSession